ఉప్పల్ బగాయత్ లో అగ్ని ప్రమాదం

Fire broke out in Uppal bhagayath
X

Fire broke out in Uppal bhagayath

రెండు కార్లు, రెండు బైక్లు, సైకిల్ దగ్ధం

మన తెలంగాణ/ఉప్పల్: ఉప్పల్ బాగాయత్‌లోని జూపిటర్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సమీపంలోని వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో రెండు కార్లు, రెండు బైకులు, ఒక సైకిల్ దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మండపంలో వెలిగించిన దీపం లేదా షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Tags

Next Story