దుండిగల్ లో కారులో కూర్చొని మంటపెట్టుకున్నాడు... సజీవదహనం

దుండిగల్ లో కారులో కూర్చొని మంటపెట్టుకున్నాడు... సజీవదహనం
X

మేడ్చల్: ఓ వ్యక్తి కారులో సజీవదహనమైన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాదా కృష్ణ (40) అనే వ్యక్తి బౌరంపేట్ లో కారులో కూర్చొని మంటలను అంటించుకున్నాడు. కారులో నుంచి మంటలు రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధం కావడంతో అతడు చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ కేసుగా నమోదు చేశారు. బౌరంపేట్ లోని ఓ విల్లా లో తన కుటుంబ సభ్యులతో కలిసి రాధా కృష్ణా ఉంటున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసుల అనుమానిస్తున్నారు.

Tags

Next Story