‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి 'దేఖ్ లేంగే సాలా' ప్రోమో రిలీజ్‌..

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి దేఖ్ లేంగే సాలా ప్రోమో రిలీజ్‌..
X

ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. 'దేఖ్ లేంగే సాలా' అనే తొలి లిరికల్ సాంగ్ ప్రమోను కొద్దిసేపటిక్రితమే రిలీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత పవన్ డ్యాన్స్ తో అలరించనున్నట్లు ప్రోమో చేస్తే అర్థమవుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి సాంగ్ ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాదిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.



Tags

Next Story