కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారులు అదృశ్యం

Children Missing
X

కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారులు అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఇద్దరు చిన్నారులు, ఈరోజు (శనివారం) ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారు. శుక్రవారం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి(10), విజయ్(9) అదృశ్యమయ్యారు. ఈ రోజు ఆర్‌బి నగర్ కాలనీకి చెందిన ముగ్గు అక్కా చెల్లెల్లు సీపాత్(8), ఆయాత్(7), మరియం(5) కనిపించకుండా పోయారు. ఉదయం ఇంటి నుంచి తండ్రితో కలిసి ముగ్గురు చిన్నారులు ఆటోలో వెళ్లారు. పిల్లలను షాపు వద్ద దింపేసి కిరాయికి వెళ్లానని పిల్లల తండ్రి చెబుతున్నాడు. ఐదుగురు పిల్లలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు కామారెడ్డి పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డి అదనపు ఎస్పి తెలిపారు.

Tags

Next Story