కారులో వెళ్తుండగా ప్లయింగ్ క్లిస్ లు... ఆకతాయి అరెస్టు

కారులో వెళ్తుండగా ప్లయింగ్ క్లిస్ లు... ఆకతాయి అరెస్టు
X

లక్నో: కారులో వెళ్తుండగా ప్లయింగ్ క్లిస్ లు ఇచ్చిన ఆకతాయిలను అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి రెడ్ కారులో వెళ్తున్నాడు. పక్క కారులో ఉన్న మహిళను ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చినట్లు సైగ చేయడంతో పాటు అసభ్య సంకేతాలు ఇచ్చాడు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో రికార్డు అవుతుందని తెలిసి కూడా ఆకతాయిలు అలాగే ప్రవర్తించారు. తాము కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా సంకేతాలు చేశాడని, వీడియో తీసిన వ్యక్తి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడన్నారు. బైక్ పై వెళ్తున్న మహిళలతో కూడా అలాగే ప్రవర్తించారన్నారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళలకు మాత్రం గౌరవం లేదని, నలుగురిలో ఉన్నామన్న కనీసం మార్యద కూడా లేదని నెటిజన్లు దుయ్యబట్టారు.

Tags

Next Story