ఎసిబి చిక్కిన అటవీశాఖ అధికారి

X
మనతెలంగాణ/ఖానాపూర్: లంచం తీసుకుంటూ ఖానాపూర్ ఫారెస్టు సెక్షన్ అధికారి రవీందర్ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ ఎసిబి డిఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం ఆగస్టు నెలలో దరఖాస్తు చేసుకున్నాడు. లైసెన్స్ రెన్యువల్ చేయడానికి రవీందర్.. సదరు వ్యక్తిని రూ.20 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.12 వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. గురువారం రవీందర్ తన కారులో బాధితుడి నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి..కరీంనగర్‌లోని ఎసిబి కోర్డులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ తెలిపారు.
Next Story
-
Home
-
Menu
