ధర్పల్లి మాజీ ఎంపిపి ఇమ్మడి గోపి దారుణ హత్య

X
Navi Mumbai Maharashtra
ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి బుధవారం దారుణ హత్య కు గురయ్యారు. ఆయన సమీప బంధువే లింగాపూర్ గ్రామ శివారులో కారు తో ఆక్సిడెంట్ చేసి బయటకు ఈడ్చి కత్తుల తో పొడిచి హత్య చేసారని సమాచారం. నిజమాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి గోపి ధర్పల్లి లింగాపూర్ నుండి గౌరారం వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గొడ్డలితో దాడి చేసి సినిమాను తలపించే విధంగా పరిగెత్తించి గొడ్డలితో నరికి చంపినట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
