దుబ్బాకలో బావిలోకి దూసుకెళ్లిన కారు: నలుగురు మృతి

దుబ్బాకలో బావిలోకి దూసుకెళ్లిన కారు: నలుగురు మృతి
X

సద్దిపేట: కారు అదుపుతప్పి బావిలో దూసుకెళ్లడంతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బల్వంత్ పూర్ గ్రామంలో దండుగుల రాజు(30), భాగ్య(25) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు నిహాన్ష్(04), కూతురు శాన్విక(02) పిల్లలు ఉన్నారు. బుధవారం రాత్రి సొంతూరు నుంచి కారులో సిద్దిపేటకు వెళ్తుండగా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బావిలోకి కారు దూసుకెళ్లడంతో నలుగురు చనిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బావిలోని మృతదేహాలను బయటకు తీశారు. బల్వంత్ పూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story