నలుగురు నకిలీ నక్సల్స్ అరెస్ట్

X
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం నలుగురు నకిలీ నక్సలైట్లను అరెస్ట్ చేసి వారి నుండి 9 ఎంఎం పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి మహేష్ బి గితే వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సిరిసిల్ల జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, పయ్యావుల గోవర్ధన్, జగిత్యాల జిల్లాకు చెందిన మంజరి సురేందర్ ఒక ముఠాగా ఏర్పడి జనశక్తి పేరిట ప్రజలను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడాలని, భూ వివాదాల్లో జోక్యం చేసుకోవాలని, చట్టవిరుద్ధ్ద పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.
Next Story
-
Home
-
Menu
