భైంసాలో రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పట్టణంలోని సాత్‌పుల్ వంతెనపై సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ వైపు నుండి నాందెడ్ వైపు వెళ్తున్న కంటైనర్, నిజామాబాద్ వైపు నుండి భైంసాకు వస్తున్న ఎర్టిగా వాహనాన్ని ఢీకొట్టడంతో.. ఎర్టిగాలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. మరొకరి పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బతికి బయటపడ్టారు. ఎర్టిగా వాహనాన్ని నడుపుతున్న బొప్ప వికాస్ (24), భోజరాం పటేల్ (42), పెద్ద రాజన్న (62), బోయిడి బాబన్న (65) అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో కుభీర్ మండలంలోని కుప్టి గ్రామ సర్పంచ్ తీవ్ర గాయాలపాలయ్యారు. హైదరాబాద్ నుండి తిరిగి వస్తూ పట్టణానికి చేరుకునే సమయంలో ప్రమాదం సంభవించడంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
Home
-
Menu
