శుక్రవారం రాశి ఫలాలు (20/11/2026)

Friday Rasi Phalalu
X

మేష రాశి:

పనుల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు మరియు కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ, తొందరపాటు నిర్ణయాలు మరియు అనవసర ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృషభ రాశి:

నూతన పరిచయాల వల్ల వ్యాపారంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినా ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరిగినప్పటికీ కుటుంబ ఖర్చులు కూడా నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.

మిథున రాశి:

మీడియా, కమ్యూనికేషన్ మరియు మార్కెటింగ్ రంగాల వారికి అనుకూల సమయం. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, సోదరుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.

కర్కాటక రాశి:

ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప పురోగతి ఉంటుంది. నిలిచిపోయిన ధనం చేతికి అందుతుంది. కోర్టు లేదా చట్టపరమైన సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం బాగుంటాయి.

సింహ రాశి:

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు, నూతన ఒప్పందాలకు చాలా అనుకూలమైన రోజు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్యా రాశి:

పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు, ఓపికతో ముందుకు సాగాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల సమాచారం అందుతుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున ముందస్తు ప్రణాళిక అవసరం.

తులా రాశి:

ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన పరిచయాలు కలసివస్తాయి.

వృశ్చిక రాశి:

ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ వార్తలు వింటారు. వ్యాపార విస్తరణకు కృషి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టతతో వ్యవహరించడం మరియు మాటపట్టింపులకు పోకపోవడం మంచిది.

ధనుస్సు రాశి:

ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. విదేశీ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి.

మకర రాశి:

పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా రాబడి నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబంలో సమయం గడపడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.

కుంభ రాశి:

భాగస్వామ్య వ్యాపారాల్లో మరియు నూతన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. బంధుమిత్ర్రులతో చిన్నపాటి విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి.

మీన రాశి:

వృత్తి, ఉద్యోగాలలో క్రమశిక్షణతో వ్యవహరించి అను అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు మరియు అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామి సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది.


Tags

Next Story