సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్

సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్
X

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా నుంచి ’పైసా డుమ్ డుమ్’ సాంగ్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ “డార్క్ కామెడీ జానర్ లోనే కొత్తగా ప్రయత్నించాం. ఫుల్ ఫన్ ఉండే మా మూవీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుంది”అని అన్నారు. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ “పైసా డుమ్ డుమ్’ సాంగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఫరియా అబ్దుల్లా కూడా మా మూవీలో ఒక పాట పాడింది. ఆ పాటను త్వరలో వింటారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, జయకాంత్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ పాల్గొన్నారు.

Tags

Next Story