ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం..కార్మికుడి సజీవ దహనం

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం..కార్మికుడి సజీవ దహనం
X

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ఉన్న మహలక్ష్మి ఫర్నీచర్ షాప్ గోదాంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో కార్మికుడు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.45 లక్షల విలువైన ఆస్తి అగ్నికి ఆహుతైనట్లు అంచనా. ఫర్నీచర్ షాపులో ఆకస్మికంగా మంటలు చెలరేగిన సమయంలో యూపీకి చెందిన నలుగురు వలస కూలీలు అక్కడ నిద్రిస్తున్నారు. వారిలో ముగ్గురు సురక్షితంగా బయటకు రాగా, మహ్మద్ ఇస్లాం అనే కార్మికుడు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ మహేశ్ బిగెతేతో పాటు పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Tags

Next Story