గద్వాల్ లో రోడ్డు ప్రమాదం

X
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న కారు జింకలపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. బస్సు కారును 100 మీటర్లు దూరం ఈడ్చుకెళ్ళింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా ఆపడం వలన కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో వాహనంలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాహనదారులు కారు డోర్ ను బలవంతంగా ఓపెన్ చేసి అందులో ఉన్న వారిని బయటకు తీశారు. కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో అందరూ సురక్షితంగా ఉన్నారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు కర్నాటక రాష్ట్రానికి చెందిన వాహనంగా గుర్తించారు. క్రేన్ సహాయంతో బస్సు నుంచి కారును పక్కకు తొలగించారు.
Tags
Next Story
-
Home
-
Menu
