బై బై గణేశా..

మనతెలంగాణ/ సిటీబ్యూరో : హైదరాబాద్ మ హానగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబా ద్, బాలాపూర్ గణపతుల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది. ఈ రెండు వినాయక విగ్రహాలను త్వరగా నమజ్జన కార్యక్రమం ముగించేందుకు వివిధ విభాగాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరంలో చారిత్రాత్మక నిమజ్జన కార్యక్రమ వేదికగా నిలిచిన హుస్సేన్ సాగర్ చుట్టూర 40 భారీ క్రేన్లను ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్లలో 5వ నెం బర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహాన్ని మధ్యాహ్నాం 12 గం.ల సమయానికి నిమజ్జన
కార్యక్రమం పూర్తిచేయాలని అధికారులు ప్రణాళికలను సిద్దంచేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు శోభయాత్రగా రానున్న వి నాయకుడిని ప్రత్యేకంగా మ. 1గం.ల నాటికి చార్మినార్‌ను దాటించాలనే దిశగా నగర పోలీసు లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ వినాయకుడిని అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రెండు గణపయ్యల నిమజ్జనం మధ్యాహ్నానికి పూర్తి చేయగలిగితే నిమజ్జనం సింహాభాగం పూర్తైనట్టేనని అధికారులు భావిస్తున్నారు. నిమజ్జనం శుక్ర, శనివారాలతో పాటు ఆదివారం మధ్యాహ్నాం వరకు సాగుతూనే ఉంటుందని జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. సీఎంసీ, ఎంఎంసీల్లో శనివారం ఉదయానికల్లా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశాలున్నాయి.
ఉ. 6గం.లకు శోభాయాత్ర ప్రారంభం
23వ తేదీ బుధవారం అర్ధరాత్రితో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలను నిలిపివేవారు. 24 గు రువారం నాడు షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు, ని మజ్జన ఏర్పాట్లు చేపట్టారు. గురువారం సాయం త్రం నుంచే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ఏ ర్పాట్లు మొదలయ్యాయి. నేడు (శుక్రవారం) తెల్లవారు జామున 4 గం.లకు భారీ గణపయ్యను ప్ర త్యేక టస్కర్‌పైకి ఎక్కించేలా ఏర్పాట్లను అధికారు లు ప్రారంభించారు. నేటి ఉ. 6:00 గం.లకు శో భాయాత్ర ప్రారంభమై మ.12:00 గం.లలోపు ని మజ్జనం పూర్తి చేసే లక్ష్యంతో పనులను అధికారులు ప్రారంభించారు. ఖైరతాబాద్ నుండి ఎన్టీఆ ర్ మార్గ్ (ట్యాంక్ బండ్) మీదుగా హుస్సేన్ సాగ ర్ వద్ద అదనపు క్రేన్‌లు, ప్రత్యేక ప్లాట్ ఫారంలు ఏర్పాటుచేయడంతో పాటు క్రేన్ నంబర్- 5 వద్దకు భారీ గణపయ్య చేరుకుంటారు. అక్కడే ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయనున్నారు.
-
Home
-
Menu
