ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం... డ్యాన్స్ చేసిన సజ్జనార్

ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం... డ్యాన్స్ చేసిన సజ్జనార్
X

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. శోభాయాత్రతో పాటు నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద సంబరాలు చేసుకున్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి సిపి సజ్జనార్ డ్యాన్స్ చేశారు. ట్యాంక్ బండ్ తో పాటు నెక్లెస్ రోడ్డు, సెక్రటెరియట్ ప్రాంతంలో నిలిపివేసిన రాకపోకలను పునరుద్దరించారు. నగరంలోని ప్రధాన నిమజ్జన కేంద్రాలకు తరలించిన గణనాథుల విగ్రహాలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించారు. నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది వ్యర్థాలను తొలగించే పనులు చేపట్టారు. దీంతో నగరంలో నిమజ్జన సందడి క్రమంగా ముగిసింది.

Next Story