గణేశ అష్టోత్తర శతనామ స్తోత్రమ్

ganesha ashtottara shatanama stotram in telugu
వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః
స్కందాగ్రజోవ్యయః పూతో దక్షోûధ్యక్షో ద్విజప్రియః ॥ 1 ॥
అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోûవ్యయః
సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః ॥ 2 ॥
సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః ॥
శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః ॥ 3 ॥
ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః ॥
ఏకదంతశ్చతుర్బాహుశ్చతురశ్శక్తిసంయుతః ॥ 4 ॥
లంబోదరశ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః ॥
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః ॥ 5 ॥
పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః ॥
అకల్మషస్స్వయంసిద్ధస్సిద్ధార్చితపదాంబుజః ॥ 6 ॥
బీజపూరఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ ॥
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ ॥ 7 ॥
శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః ॥
కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః ॥ 8 ॥
చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః ॥
అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః ॥ 9 ॥
శాంతః కైవల్యసుఖదస్స చ్చిదానందవిగ్రహః ॥
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః ॥ 10 ॥
ప్రమత్తదైత్యభయదః శ్రీకంఠో విబుధేశ్వరః ॥
రమార్చితోవిధిర్నాగరాజయజ్ఞోపవీతవాన్ ॥ 11 ॥
స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః ॥
స్థూలతుండోûగ్రణీర్ధీరో వాగీశస్సిద్ధిదాయకః ॥ 12 ॥
దూర్వాబిల్వప్రియోûవ్యక్తమూర్తిరద్భుతమూర్తిమాన్ ॥
శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః ॥ 13 ॥
స్వలావణ్యసుధాసారో జితమన్మథవిగ్రహః ॥
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః ॥ 14 ॥
హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః ॥
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం ॥ 15 ॥
తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముత్యతః ॥
యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకం ॥ 16 ॥
దూర్వాదళైర్బిల్వపత్రైః ప్పుర్వా చందనాక్షతైః ॥
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘూ్నః ప్రముచ్యతే ॥ 17 ॥
అఫ్టోత్తర శతనామావళి
ఓం గజాననాయ నమః;
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః;
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః;
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః 10 ఓం సుఖ నిధయే నమః;
ఓం సురాధ్యక్రాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహా కాలాయ నమః
ఓం బలయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరరాయ నమః;
ఓం హ్రస్వ గ్రీవాయ నమః 20
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కకటాయ నమః
ఓం మహావీరాయ నమ;
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్న కర్తే నమః
ఓం విఘ్నహంత్రే నమః; 30
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాకృతయే నమః
ఓం శృంగారిణీ నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివ ప్రియాయ నమః
ఓం శ్రీఘ్ర కారిణీ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః 40
ఓం బలోత్తితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ఘిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్ర పూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః 50
ఓం సర్వాయ నమః;
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్తే నమః
ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచ హస్తాయ నమః
ఓం పార్వతీ నందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః 60
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః;
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదక ప్రియాయ నమః;
ఓం కాంతిమతే మతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మ రూపిణే నమః 70
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణు ప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జితి మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యూయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః 80
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః; 90
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః;
ఓం మణికింకిణీ మేఖాలయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః;
ఓం సహిష్టవే నమః
ఓం సతతోత్తితాయ నమః
ఓం విఘాత కారిణీ నమః;
ఓం విశ్వగ్ద్రుశే నమః 100
ఓం విశ్వరకాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః;
ఓం సమస్త జగదాధారాయ నమః;
ఓం సర్వైశ్విర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 108
ఓం సర్వాయ నమః;
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్తే నమః
ఓం సర్వసిద్ది ప్రదాయ నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచ హస్తాయ నమః
ఓం పార్వతీ నందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
బిల్వం..
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం !
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం !!
వరసిద్ది వినాయకాయ, బిల్వపత్రం సమర్పయామి
ధూపం..
దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదోభవ దూపమాఘ్రాపయామి
(అగరవత్తుల ధూపం స్వామికి చూపించాలి)
దీపం..
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాజ్యోతిదం మయా గృహాన మంగళం దీపం
ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి (దీపాన్ని స్వామికి చూపించాలి)
నైవేద్యం
మహానివేదన (పిండివంటలు, అన్నం, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్లు, కొబ్బరికాయ, అరటిపండ్లు స్వామి ముందుంచాలి)
శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
అని నైవేద్యంపై నీళ్ళు చల్లాలి
సత్యం త్వర్తేన పరిషించామి.. నైవేద్యం చుట్టూ నీళ్ళు తిప్పాలి
అమృతమస్తు.. స్వామి దగ్గర నీళ్ళు వదలాలి
అమృతోపస్తరణమసి... అని నైవేద్యంపైన నీళ్ళు చల్లి ఈ కింది మంత్రాలు చదువుతూ అయిదుసార్లు చేత్తో నైవేద్యాన్ని స్వామికి చూపించాలి.
ఓం ప్రాణాయస్వాహా.. ఓం అపానాయస్వాహా.. ఓం వ్యానాయస్వాహా ...
ఓం ఉదానాయస్వాహా.. ఓం సమనాయ స్వాహా..
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (స్వామి దగ్గర నీళ్ళు చల్లాలి)
అమృతాపిథానమసి.. ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తౌ ప్రక్షాళయామి.
పాదౌ ప్రక్షాళయామి..
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి.. అంటూ నీళ్ళు వదలాలి
పానీయం..
మహాస్వాద్యమిదం దివ్యం పానీయంతే నిషేదితం !
మయాభక్ష్యా శివాపుత్ర
గృహాణ గణనాయక !!
-
Home
-
Menu
