తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

X
Geeta worker dies
సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లీ నర్సాగౌడ్ అనే గీతా కార్మికుడు తాటి చెట్టుపై నుండి పడి మరణించాడు. సోమవారం ప్రతి రోజులాగానే కల్లు తీయడానికి చెట్టు ఎక్కి గీత గీస్తుండగా చెట్టుపై నుండి పడి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె వున్నారు. అందరితో కలుపుగోలుగా వుండి తన పని చేసుకునే నర్సాగౌడ్ మృతి గ్రామస్తులను కలిచివేసింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
