రోగాలకు మూలకారణం జన్యువులేనా?

genes & diseases impact factor
X

genes & diseases impact factor

ఫిలడెల్ఫియాలోని ఒక వైద్య సంస్థలో ఒక అధ్యయనం జరిగింది. ఒక యువ వైద్యుడు గుడ్ల వల్ల నిజంగా హాని జరుగుతుందా కొలెస్ట్రాల్ లెవెల్ లో పెరుగుతాయా అని ఓ ప్రయోగం చేశాడు. అనేక వారాలపాటు ప్రతిరోజూ ఒక 4 నుంచి 6 గుడ్లు తిని ప్రయోగాలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ను ల్యాబ్లో పరిశీలించాడు అతనికి ఆశ్చర్యం కలిగింది. ల్యాబ్ ఫలితాలు అతని హెచ్‌డిఎల్ పెరగడంతో పాటు కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ వాస్తవానికి తగ్గినట్లు చూపించాయి. మనం ఒకప్పుడు తప్పు అన్నది ఇప్పుడు ఒప్పుఅవుతుంది. ఇప్పుడు ఒప్పు అన్నది కొన్నాళ్ళు కు తప్పు అవుతుంది. మరి ఇలా ఎందుకు ఫలితాలు రివర్స్ అవుతాయి..

కొన్ని ఆహారాలు, హైపర్ కొలెస్ట్రాల్ ప్రమాదాల గురించి చేసిన అధ్యయనాలు కొంత కాలానికి తిరగబడ్డాయి. కొబ్బరి నూనె, రొయ్యలు, షెల్ ఫిష్, గుడ్లు, కొవ్వు మాంసాలను ఉపయోగించకూడదని 25 సంవత్సరాల క్రితం సలహా బోర్డు హెచ్చరించింది. వెన్న నెయ్యి చాలా చెడ్డది అని ప్రచారం చేయబడ్డది కానీ మనము వెస్ట్రన్ ఫుడ్ చూసాం అంటే వాళ్ళు వెన్న నెయ్యి లేనిది అసలు తినరు. బట్టర్ అనేది చాలా కామన్ గా అన్నిటిలో బ్రెడ్ మీద పూసుకునే తింటారు.

కట్ చేస్తే.

ఒకప్పుడు బ్యాడ్ ఫుడ్స్ అని చెప్పినవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ బెస్ట్ ఫుడ్స్. మరి ఏది మంచిది.. ఈ ఊదరగొట్టుడు సమాచారం అంతా ఎందుకు చేస్తారు. శారీరక శ్రమకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం మితంగా ఆహారం తీసుకుంటూ ఉండటం ఉత్తమమైన సూచన. 80 నుండి 90% గుండె జబ్బులకు ప్రధాన కారణం ధూమపానం, మద్యపానం, జీవక్రియ వ్యాధులు మెటబాలిక్ డిసీజెస్ హెచ్ టిఎన్ రక్తపోటు, డయాబెటిస్, జన్యుపరమైన హైపర్లిపిడెమియా, హోమోసిస్టినీమియా, విపరీతమైన ఒత్తిడి అని తెలుస్తుంది.

మరికొందరు ఏమి తిన్నా ఏం కాదు, మరికొందరు తినవలసిన దానికంటే ఎక్కువ తింటూ ఉంటారు. మరి కొందరైతే ఏమీ తినకున్నా గాని జబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకు మనకు వచ్చే అన్ని వ్యాధులకు అసలైన మూల కారణం మూల విరాట్ ఏది అంటే అది మన జన్యు నిర్మాణమే. మన శరీరానికి యజమాని బాస్ మన జన్యు నిర్మాణమే అసలు సిసలైన అపరాధి. మన జన్యు నిర్మాణాన్ని మనం మార్చలేము మనకు వచ్చే జబ్బులను అయితే మనం కొంతవరకు నివారించుకోగలము. కానీ ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ, ఒక రకమైన క్రమశిక్షణతో కూడిన జీవితం చాలా ఇంపార్టెంట్. ప్రధానమైన ధూమాపానం మద్యపానం జోలికి పోకుండా ఉండడం చాలా అవసరం. శారీరక శ్రమ చాలా అవసరం ఎందుకంటే ప్రతిరోజు వాకింగ్ రన్నింగ్ జాగింగ్ స్విమ్మింగ్ లాంటివి చేయడం చాలా అవసరం.

చాలామంది మనకు షుగర్ జబ్బు వచ్చింది లేదా బీపీ వచ్చింది మన జీవితమంతా వ్యర్థమైపోయింది అని బాధపడుతుంటారు అవి జబ్బులు కావు. అవి ఏమి చేసినా పోవు మనకు జన్యుపరంగా వచ్చి ఉంటాయి కాకపోతే వాటిని మనం శారీరక శ్రమ, క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడం వలన వాటిని అదుపులో పెట్టుకోగలము అంతేకానీ అవి కంప్లీట్గా పోవు. ఆ జబ్బులు వచ్చిన వెంటనే మనం కృంగిపోకుండా మనకు దేవుడు ఒక మంచి చేయడానికి క్రమబద్ధమైన జీవితం గడపడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని మనము పాజిటివ్ గా తీసుకొని ముందుకు సాగి పోవాలి అంతే. రాబోయే కాలంలో జీనోమ్ థెరపీ అని జన్యు సీక్వెన్స్ మార్చే విధానం వస్తే అప్పుడు వాటిని రివర్స్ చేస్తే మన డయాబెటిస్ హైపర్ టెన్షన్ లాంటివి ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక ఊహ మాత్రమే ఎంతవరకు ఈ ప్రయోగాలు సక్సెస్ అవుతాయో తెలియదు. ప్రస్తుతానికైతే క్రమబద్ధమైన జీవనం, శరీరక శ్రమ మితమైన ఆహారం అనేటివి నేటి జీవితానికి మార్గదర్శకాలు...

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Tags

Next Story