ఘట్ కేసర్ లో కాలేజీ భవనం పైనుంచి దూకి నవ వధువు ఆత్మహత్య

ఘట్ కేసర్ లో కాలేజీ భవనం పైనుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
X

ఘట్‌కేసర్: పెళ్లైన 18 రోజులకే నవ వధువు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన పల్లవి(20) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పల్లవి ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. శ్రీకాంత్ ప్రభుత్వం ఉద్యోగం చేస్తుండడంతో అత్తమామ సంధ్య, మధుసూదన్ రెడ్డి భారీగానే కట్నం కానుకలు పెళ్లి వేడుకలో అతడికి అప్పజెప్పారు. అదనపు కట్నం కావాలని పల్లవిని భర్త వేధిస్తున్నాడు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె ఇంజనీరింగ్ కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసతున్నారు.

Tags

Next Story