బీర్పూర్ లో లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికిన గిరిధావర్..

బీర్పూర్ లో లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికిన గిరిధావర్..
X

జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలంలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో ఓ అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గిరిధావర్ గా విధులు నిర్వహిస్తున్న రాహుల్.. ఓ మహిళ నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితురాలు, ఎసిబి అధికారులను ఆశ్రయించింది.

ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం.. గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎసిబి డిఎస్పి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు అకస్మిక దాడులు జరిపారు. బాధితురాలి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సదరు గిరిధావర్ ను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story