గర్భస్రావంతో బాలిక మృతి

pregnant died in private hospital At Vikarabad
చెన్నై: ఇంటర్ చదువుతున్న బాలికకు బలవంతంగా గర్భస్రావం చేయడంతో ఆమె మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం వేళచ్చేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెంగల్పట్ట ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొంది. ఆమె గర్భం దాల్చడంతో ఒక్కసారిగా ఇంట్లోనే బాలిక పడిపోయింది. వెంటనే ఆమెను తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పది వారాల గర్భంతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఆమెకు గర్భస్రావం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో బలవంతంగా గర్భస్రావం చేస్తుండగా బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో చెంగల్పట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారు.
Tags
-
Home
-
Menu
