పాల్వంచలోని ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జన్మనిచ్చిన బాలిక

పాల్వంచ: ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో మృత శిశువుకు మైనర్ బాలిక జన్మనిచ్చింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది. పాల్వంచలోని ఓ కేంద్రానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లిష్ పరీక్ష రాయటానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్ అనుమతితో విద్యార్థిని టాయ్‌లెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో సిబ్బంది మరుగు దొడ్డి వైపు వెళ్లారు. అప్పుడు బాలిక చిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చింది. అనుమానం వచ్చి బాలిక వివరాలు ఆరా తీయటంతో అసలు విషయం బయటపడింది. సిబ్బంది బాత్రూమ్ లోకి వెళ్లిచూడగా బేసిన్‌లో మృతశిశువు కనిపించింది. అయితే పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్రూం బేసిన్‌లో కుక్కినట్లు బాలిక తెలిపింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
