మూసీ నదిలో ఈతకు వెళ్ళిన బాలిక గల్లంతు

X
సూర్యాపేట జిల్లా, నేరెడెచర్ల మండలంలోని సోమవరం గ్రామానికి చెందిన కొమరాజు సుస్మిత (13) మూసీ నదిలో ఈతకు వెళ్ళి గల్లంతైనట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మద్యాహ్నం సమయంలో సోమప్ప దేవాలయం వెనుక భాగంలో గల మూసీ నదిలో ఈత కొట్టేందుకు సుస్మితతో పాటు మరో ఇద్దరు బాలికలు దీక్షిత, అశ్విని వెళ్ళారు. ఈ క్రమంలో సుస్మిత గల్లంతు కావడంతో మూసీ నది ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రెస్కూ టీం, రెస్కూ విభాగానికి సమాచారం అందించి సంఘటన స్థలానికి రప్పిస్తున్నట్లు తెలిపారు.
Next Story
-
Home
-
Menu
