ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన

ఐదు సంవత్సరాలుగా తాము ఇద్దరం ప్రేమించుకున్నామని, ఈ నెల ఫిబ్రవరి 3 వ తేదీన సికింద్రాబాద్‌లో ఒక గుడిలో తనను పెళ్ళి సైతం చేసుకుని, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల చెప్పుడు మాటలు విని తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడని ఒక యువతి తన ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ తాలూకా దౌల్తాబాద్ మండల పరిదిలోని గోకపస్లావాద్ గ్రామంలో గురువారం రోజు చోటు చేసుకుంది. బాధిత యువతి మరియు యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకపస్లావాద్ గ్రామానికి చెందిన తుప్పుడు బాస్కర్, తుప్పుడు సాయమ్మల కూతురు అశ్విని(23) అదే గ్రామానికి చెందిన కొంగ నర్సప్ప, కొంగ వెంకటమ్మల కుమారుడు కొంగ బుగ్గప్ప(24)లు గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. యువతి గత కొన్ని రోజులుగా హైద్రాబాద్‌లో బ్యూటీపార్లర్‌లో పని చేస్తుంది. యువకుడు బుగ్గప్ప సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు.
కాగా 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఇరువురు పిబ్రవరి నెల 3న సికింద్రాబాద్‌లోని ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహన్ని యువకుడి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన తమ్ముడు తప్పిపోయినట్లు యువకుడి అన్న శేఖర్ దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకి తెలుసుకుని వివాహం చేసుకున్నట్లు గుర్తించి యువతి, యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాల వారికి పోలీసులు సర్ది చెప్పి పంపించారు. ఈ క్రమంలో యువతిని తీసుకు వెళ్ళిన యువకుడు గత వారం రోజులుగా హైద్రాబాద్‌లో ఒక గదిలో ఉన్నాడు. మంగళవారం రోజు గదిలో యువతిని ఒక్క దాన్నే ఉంచి భయటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో దిక్కు తోచని యువతి తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి వెళ్ళిన వారు యువకుడు తమ అమ్మాయిని మోసం చేసి పారి పోయినట్లుగా అనుమానించి స్థానిక నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కాని బుగ్గప్ప సెల్‌ఫోన్ స్విచ్చాప్ రావడంతో ఏం చేయాలో తెలియక గ్రామంలోని వారి ఇంటి దగ్గరకి వచ్చిన అశ్వినిని వారి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు.
దీంతో ప్రేమ పేరుతో తనను పెళ్ళి చేసుకుని ఇంట్లోకి రానివ్వకుండా మోసం చేశారని వారి ఇంటి ముందు నిరసనకు దిగింది. కాగా అశ్విని ఇంటి ముందు నిరసనకు దిగడంతో బుగ్గప్ప కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్ళి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా గ్రామానికి చేరుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేయమని తాము వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి తమ అమ్మాయికి న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. తాము గత ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్ళి సైతం చేసుకున్నామని, కాని ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల మాటలు విని తన భర్త తనను మోసం చేస్తున్నాడని, తన భర్త తనకు కావాలని తనకు న్యాయం చేయాలని ఈ సందర్బంగా అశ్విని డిమాండ్ చేస్తుంది.
-
Home
-
Menu
