పసిడి, వెండి ధరలు ఆకాశాన్నంటాయ్

10 గ్రా. బంగారం ధర రూ.1,78,850
కిలో వెండి రూ.4,25,000 లకు చేరింది..
దేశీయ మార్కెట్లో డిమాండ్ క్షీణించింది : డబ్లుజిసి
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850 చేరిం ది. మరోవైపు కిలో వెండి ధర రూ.25,000 పెరిగి రూ.4,25,000 లకు చేరింది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో రోజు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధానిలో 10 గ్రాము ల 24 క్యారెట్ల బంగారం రూ.1,76,121 వద్ద ప్రారంభమై, స్వల్ప తగ్గుదలతో రూ.1,75,340 వద్ద ముగిసింది.
నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.21,030 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.3,79,988కి చేరి, నాలుగు రోజుల్లో రూ.62,283 పెరిగింది. నగరాలవారీగా పన్ను లు, తయారీ ఛార్జీల కారణంగా ధరల్లో తేడా ఉంటుంది. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, రూ పాయి బలహీనత, కేంద్ర బ్యాంకుల భారీ బం గారం కొనుగోళ్లు ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రూపాయి పడిపోవడం వల్ల ధరలు పెరిగాయని ఎల్‌కెపి సెక్యూరిటీస్‌కు చెందిన జతిన్ త్రివేది తెలిపారు.
డిమాండ్ తగ్గుతోంది..
ఓ వైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ మరోవైపు వీటికి భారత్‌లో డిమాండ్ తగ్గుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్లుజిసి) ప్రకారం, 2025 సంవత్సరంలో దే శంలో బంగారం డిమాండ్ 11 శాతం క్షీణించి 710 టన్నులకు పడిపోయింది. 2026 సంవత్సరంలో కూడా పసిడి డిమాండ్ 600 నుంచి 700 టన్నుల మధ్య ఉండొచ్చని డబ్లుజిసి ఫుల్ ఇయర్ 2025 గోల్డ్ డిమాండ్ ట్రెండ్ నివేదిక పేర్కొంది. 2024లో మొత్తం బంగారం డిమాండ్ 802 టన్నులుగా ఉంది.
-
Home
-
Menu
