బంగారం, వెండి ధరలు తగ్గుముఖం

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం
X

బంగారం, వెండి ధరలు శనివారంనాడు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదారాబాద్ బులియన్ మారెక్ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,660కు చేరుకుంది. శుక్రవారంనాటి ధరతో పోల్చుకుంటే రూ.1030 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 పలుకుతోంది. ఇది రూ.950 మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా శనివారం తగ్గుదల నమోదు చేశాయి. వెండి కిలోకు రూ.4,900 వేల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.75 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Tags

Next Story