మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో గురువారం స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజే దాదాపు రూ.3 వేలకు పైగా పెరిగి 1,30,800 కు చేరుకుంది. అమెరికాలో షట్‌డౌన్ ముగిసిపోవడం ఈ ధరలకు ఊతం ఇచ్చినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. 99.5 శాతం స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు రూ.3000 వంతున పెరిగి రూ.1,30,000 కు చేరింది. బుధవారం మార్కెట్ ముగిసేనాటికి 10 గ్రాములు ధర రూ.3000 వంతున పెరిగి రూ.1,27,300 వరకు పలికింది
. అంతకు ముందు స్థానిక బులియన్ మార్కెట్‌లో రూ.1,27,000 ధర పలికింది. ఇక వెండి ధరలు అన్ని పన్నులు కలుపుకుని రూ.7700 వంతున పెరిగి కిలో రూ. 1,69,000 వరకు చేరింది. బుధవారం వెండి ధరలు రూ.5540 వంతున పెరిగి కిలో వెండి రూ.1,61,300 పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్సు మళ్లీ 4200 స్థాయిని దాటి 4218 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఔన్సు 54.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీన్నిఅనుసరించి దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి.
-
Home
-
Menu
