బంగారం, వెండి భారీగా తగ్గుముఖం

Gold prices increased again
అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం శుక్రవారంనాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు పలుకగా, 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలుగా నడిచింది. శనివాంనాడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్‌ల బంగారంపై 2,940 రూపాయలు, 22 క్యారెట్ బంగారంపై 2,750 రూపాయలు తగ్గింది.
ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970 రూపాయల దగ్గర.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి.శుక్రవారంనాడు కిలో వెండి 2,60,000 రూపాయలు, 100 గ్రాముల వెండి 26,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. శనివారంనాడు కిలోపై 10 వేల రూపాయలు.. 100 గ్రాములపై వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,50,000 రూపాయల దగ్గర, 100 గ్రాముల వెండి 25 వేల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
-
Home
-
Menu
