మళ్లీ భారీగా పెరుగుతున్న వెండి, బంగారం ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?

X
బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. ఇటీవల వెండి, పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగులు పెడుతున్నాయి.తాజాగా బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దీంతో తులం గోల్డ్ ధర లక్ష 30 వేల రూపాయలకు చేరుకోగా.. వెండి రెండు లక్షల రూపాయలకు చేరువైంది. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధరపై రూ.1,360 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రామలు గోల్డ్ ధరపై రూ.1,250 పెరిగింది. ఇక, వెండి ధరపై ఏకంగా 9 వేల రూపాయలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,29,820కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,000కు పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.1,92000కు దూసుకెళ్లింది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Next Story
-
Home
-
Menu
