9 రోజుల్లోనే రూ.17వేలకు పైగా పడిపోయిన బంగారం..

Gold Jewellery Missing at Diagnostic Centre
X

ముంబై : బంగారం ధరలు వరుసగా పడిపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం 9 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 17,600 మేర పడిపోయింది. గత శుక్రవారం బులియన్ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం (10 గ్రా.) ధర రూ. 5,200 తగ్గి రూ. 1,29,300 కు చేరగా, అంతకుముందు గురువారం సెషన్ ధర రూ. 1,34,500 గా ఉంది. నవంబర్ 8న దీపావళి నాడు 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,570 ఉండగా, నవంబర్ 21 నాటికి రూ. 1,25,080 కు తగ్గి రూ. 18,490 పతనమైంది. 22 క్యారెట్ల బంగారం రూ. 1,31,600 నుండి రూ. 1,14,650 కు చేరి రూ. 16,950 తగ్గింది. జనవరి రికార్డు స్థాయి రూ. 1.83 లక్షలతో పోలిస్తే ధర రూ. 53,700 (29.3 శాతం) పడిపోయింది.

అయితే అమెరికన్ డాలర్ బలపడటం, బాండ్లపై అధిక రాబడులు, డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉండటంతో బంగారంపై ఒత్తిడి కొనసాగుతోంది. స్వల్పకాలంలో ధరలు రూ. 1.15 లక్షల నుండి రూ. 1.22 లక్షల స్థాయిని పరీక్షించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టెక్నికల్‌గా బంగారం ఓవర్‌సోల్డ్ స్థితికి చేరడం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ వల్ల త్వరలోనే ధరలు పుంజుకునే సూచనలూ ఉన్నాయంటున్నారు.

Tags

Next Story