పరుగు ఆపని పసిడి

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. గ్రీన్‌లాండ్ సంక్షోభం కారణంగా ఉద్రిక్తతలు పెరగ్గా, డాలర్ బలహీనపడుతుండడం వల్ల బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. బుధవారం ఎంసిఎక్స్ గోల్డ్ ధర 10 గ్రాములు ఏకంగా 7,774 పెరిగి రూ.1,58,339 కి చేరుకుంది. మంగళవారం రోజు ఇది రూ.150,565 వద్ద ఉంది. వెండి ధర కిలో రూ.3,34,840 కి చేరుకోగా, క్రితం రోజు ఇది రూ.3,23,672 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 4,800 డాలర్ల కీలక మార్క్ దాటింది. ఔన్స్ వెండి ధర 95.87 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ అంశంపై యూరోపియన్ దేశాలను బెదిరించడం వల్ల వాణిజ్య యుద్ధ భయం పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.91.70కి పడిపోవడంతో దేశీయంగా బంగారం ఖరీదైంది. అలాగే ఆర్‌బిఐ సహా ప్రపంచ కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. డాక్టర్ రెనిషా ప్రకారం, ఉద్రిక్తతలు పెరిగితే 2026లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.90 లక్షలకు చేరవచ్చు.
-
Home
-
Menu
