రికార్డు స్థాయికి బంగారం..

రికార్డు స్థాయికి బంగారం..
X

గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సోమవారం బంగారం 5,100 డాలర్లను దాటి చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకుంది. భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక విధానాలపై అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా బంగారంపై ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్లు తగ్గవచ్చనే అంచనాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు బంగారం ర్యాలీకి కారణమవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య, టారిఫ్ హెచ్చరికలతో అమెరికా ఆస్తులపై నమ్మకం తగ్గిందని విశ్లేషకులు తెలిపారు. వెండి, ప్లాటినం, పల్లాడియం ధరలూ కొత్త గరిష్టాలను తాకాయి. 2026లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story