ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

Bhatti Vikramarka
X

ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో రూ.183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన నిధుల్లో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్‌మెంట్ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితోపాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్ లు,అడ్వాన్సులున్నాయి.

Tags

Next Story