డెడ్ ఎండ్ దాటిన రైలు.. తప్పిన ప్రమాదం..

X
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఓ గూడ్స్ రైలు డెడ్ ఎండ్ దాటింది. పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పనులు జరుగుతుండగా యంత్రాలు తెచ్చే గూడ్స్ రైలు ప్రమాదవశాత్తు డెడ్‌లైన్ దాటినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో రైలు ఇంజిన్ పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. అయితే ఇంజిన్‌కు మిగతా బోగీలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మట్టిలో కూరుకుపోయిన గూడ్స్ రైలు ఇంజిన్‌ను వెలికి తీసే పనులు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
