అంతరిక్షంలో ఎఐ డేటా సెంటర్!

అంతరిక్షంలో ఎఐ డేటా సెంటర్!
X

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్లపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో గూగుల్ చేపట్టిన “ప్రాజెక్టు సన్‌క్యాచర్‌” ప్రయోగం ఆసక్తిరేపుతోం ది. భూమిపై ఏర్పాటు చేసే డేటా సెంటర్లను అంతరిక్షంలోనే ఏర్పాటు చేయడానికి గూగుల్ ఈ ప్రాజెక్టు చే పట్టింది. ఇది సాధ్యమా కాదా అన్నది ఇప్పుడే చెప్పలేకున్నా వినూత్న ప్రయోగం మాత్రం అందరి దృష్టిని ఆ కర్షిస్తోంది. కృత్రిమ మేధ (ఎఐ)కు అవసరమైన కం ప్యూటింగ్ మౌ లిక వసతులను భూమి నుంచి అంతరిక్షానికి తరలించగలమా? ఈ ప్రశ్నకు సమాధానం వె తుకుతోంది గూగుల్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’. ఇ ది దీర్ఘకాలిక పరిశోధనా ప్రాజెక్టు. అంతరిక్షంలో భారీ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఏ ర్పాటు చేయడం సాధ్యమా అన్నది ఇందులో పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా త్వరలో ఒక ప్రో టోటైప్ ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి పంపి, గూగుల్ అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు (టిపియుఎస్) అంతరిక్ష పరిస్థితుల్లో ఎలా పనిచేస్తాయో పరీక్షించనున్నారు.

భూమికంటే ఎనిమిది రెట్లు సౌరశక్తి?

గూగుల్ పరిశోధకుల ప్రకారం.. తక్కువ భూ కక్ష్య (ఎల్‌ఇఒ)లోని ఉపగ్రహాలకు భూమిపై ఉన్న ప్రాంతాలతో పోలిస్తే దాదాపు నిరంతర సూర్యకాంతి అందుబాటులో ఉంటుంది. దీంతో కొన్ని పరిస్థితుల్లో భూమిపై సౌర విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే ఎనిమిది రెట్ల వరకు ఎక్కువ సౌరశక్తిని పొందే అవకాశం ఉందని ప్రాజెక్టు బృందం అంచనా వేస్తోంది. ఈ అదనపు శక్తిని ఏఐ కంప్యూటింగ్‌కు ఉపయోగించాలన్నది సన్‌క్యాచర్ ఆలోచన. భవిష్యత్తులో ఒకే ఉపగ్రహం కాకుండా.. అనేక ఉపగ్రహాలను సమూహాలుగా అనుసంధానించి, వాటిపై పెద్ద ఏఐ పనిభారాలను పంపిణీ చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

అసలు సవాళ్లు ఇవే

అంతరిక్షంలో కంప్యూటర్లు నడపడం అంత సులభం కాదు. తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు, రేడియేషన్, పరికరాల శీతలీకరణ, ఉపగ్రహాల మధ్య వేగవంతమైన డేటా మార్పిడి వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏఐ మోడళ్లకు భారీగా అవసరమయ్యే విద్యుత్, డేటా, కంప్యూటింగ్ శక్తిని అంతరిక్షంలో సమన్వయం చేయడం పెద్ద ఇంజినీరింగ్ సవాలుగా మారనుంది. ప్రస్తుత ప్రయోగం ఈ ప్రశ్నలకు వెంటనే తుది సమాధానం ఇవ్వదు. అయితే కక్ష్యలో టిపియు ఆధారిత కంప్యూటింగ్ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా పరీక్షించే కీలక తొలి అడుగు కానుంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత విజయవంతమైతే.. భూమిపై భారీ ఏఐ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్, స్థలం వంటి వనరులకు ప్రత్యామ్నాయంగా అంతరిక్షాన్ని ఉపయోగించే అవకాశాలపై కొత్త అధ్యాయానికి తెరతీయవచ్చు.

Tags

Next Story