డిసెంబర్‌లో 6శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

న్యూఢిల్లీ: 2025 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆరు శాతం పెరిగాయి. మొత్తం స్థూలంగా రూ.1.74 లక్షల కోట్ల కు చేరుకున్నాయని ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మధ్య కాలంలో భారీగా పన్నులు తగ్గించడం తో దేశీయ లావాదేవీల నుంచి వచ్చే ఆదాయాల వృద్ధి మందగించినా, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడం విశేషం. గతంలో అంటే 2024 డిసెంబర్ లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.64 లక్షల కోట్ల మేరకు ఉంది. 2025 నవంబర్ లో పన్ను వసూళ్లు భారీగా తగ్గడంతో జెఎస్టీ ఆదాయాలపై పూర్తి ప్రభావం కన్పించింది. దీంతో వసూళ్లు 1.70 లక్షల కోట్లుగా ఉంది.
2025 డిసెంబర్ లో దేశీయ లావాదేవీలద్వారా స్తూల ఆదాయం 1.2 శాతం పెరిగి, రూ. 1.22 లక్షల కోట్లకు చేరుకుంది. దిగుమతి చేసుకున్న వస్తువుల నుంచి వచ్చే ఆదాయం 19.7 శాతం పెరిగి రూ. 51,977 కోట్లకు చేరుకుంది. దీంతో మొత్తం స్థూల జిఎస్టీ ఆదాయం రూ. 1,74,550 కోట్లకు చేరుకుంది. కాగా డిసెంబర్ లో జిఎస్టీ వాపస్ ఇచ్చిన మొత్తం 31 శాతం పెరిగి రూ. 28,980 కోట్లకు చేరుకుంది. రీఫండ్‌లను సద్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ ఆదాయం రూ. 1.45 ల క్షల కోట్లకు పైగా ఉన్నాయి.
Tags
-
Home
-
Menu
