కోఠిలో కాల్పుల ఘటన.. నిందితుల గుర్తింపు

X
హైదరాబాద్: నగరంలోని కోఠిలో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల ఘటన కేసులో పురోగతి లభించింది. గత శనివారం కోఠిలోని ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం ఎటిఎం వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఎటిఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓవ్యక్తిని రెక్కీ చేసి తుపాకీతో దాడి చేశారు. కాల్పులు జరిపి రూ.6లక్షలు దొంగలించి స్కూటీపై పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సిసి కెమెరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 800కు పైగా సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు సోమవారం నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు... వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
