భద్రాద్రిలో వైద్యుల నిర్లక్ష్యం..... చితాభస్మంలో కత్తెర

X
గుండాల: భద్రాద్రి జిల్లా గుండాలలో వైద్యుల నిర్లక్ష్యంలో తల్లి బిడ్డలు మృతి చెందారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 13న వనజకు పురిటినొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు లేకపోవడంతో వనజకు స్టాఫ్ నర్సు కాన్పు చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వనజ పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందారు. అప్పటికే శిశువు మృతి చెందింది. తల్లీబిడ్డల అంత్యక్రియలు పూర్తయ్యాక చితాభస్మంలో కత్తెర లభ్యమైంది. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లీబిడ్డలు మరణించారని కుటుంబసభ్యుల ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేశారు.
Next Story
-
Home
-
Menu
