దక్షిణాఫ్రికా బార్ వద్ద తుపాకీ కాల్పులు...11 మంది మృతి

X
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా పాలనా రాజధాని ప్రిటోరియా సమీపాన టౌన్‌షిప్ లోని ఓ బార్ వద్ద తుపాకీ కాల్పులు చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారి వయసు వివరాలు పోలీసులు వెల్లడించలేదు. ప్రిటోరియాకు పశ్చిమ వైపు ఉన్న సౌల్స్ విల్లే లోని లైసెన్సు లేని బార్‌లో శనివారం తెల్లవారు జామున కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు చెప్పారు. మృతుల్లో మూడేళ్ల పసివాడు, 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారని వివరించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
