మంచిర్యాలలో భర్తను రోడ్డు ప్రమాదంలో చంపించి.... రెండు కోట్లు బీమా సొమ్ము, అక్రమ సంబంధం...

మంచిర్యాల: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడంతో పాటు రెండు కోట్ల బీమా కోసం భర్తను సుపారీ గ్యాంగ్ తో చంపించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గుడిపేట గ్రామంలో సాయినకుమార్(45), భారతి అనే దంపతులు నివసిస్తున్నారు. భారతి అదే గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో చంపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో భర్తను రోడ్డు ప్రమాదంలో చంపిస్తే రెండు కోట్ల బీమా సొమ్ము వస్తుందని ఆశ పడింది. రామ్ మల్లేష్ అనే వ్యక్తి ఇచ్చి అప్పు తిరిగి ఇవ్వడం లేదని సాయితో గొడవకు దిగాడు. తన భర్తను చంపేస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని రామ్ మల్లేష్ తో భారతి సుఫారీ మాట్లాడుకుంది. రెండు లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా అతడికి ఇచ్చింది.
శ్రీరామ్ అనే వ్యక్తిని మల్లేష్ సంప్రదించి హత్యకు ప్లాన్ చేశారు. మే 22న ముల్కల గ్రామ శివారులో కుమార్ మద్యం తాగించి అనంతరం తలపై సుత్తెతో కొట్టి హత్య చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా రోడ్డు పక్కన బైక్ పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుమార్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బటయకు వచ్చాయి. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పారిపోయిన రామ్ మల్లేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Tags
-
Home
-
Menu
