కన్నీళ్ళకే కష్టాలు వచ్చే... వికలాంగుడి బాధ వర్ణనాతీతం

కన్నీళ్ళకే కష్టాలు వచ్చే... వికలాంగుడి బాధ వర్ణనాతీతం
X

మహబూబాబాద్: ఓ వికలాంగుడికి ప్రభుత్వ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న వికలాంగుడి కన్నీటి గాధ తెలిస్తే కంట నీరు రావల్సిందే. తనకొచ్చే అరకొర పెన్షన్ కు అధికారులు ముప్పతిప్పలు పెట్టడంతో లక్ష కొర్రెలు పెడుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలోని బేతులు గ్రామానికి చెందిన జినక విజయ్ పుట్టినప్పటి నుంచే పోలియోతో బాధపడుతున్నాడు. ఈ మధ్యలో తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నాడు. గత మూడు నెలల నుంచి పెన్షన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఆధార్ కార్డుతో సదరం సర్టిఫికెట్ లింక్ కాలేదన్న కారణంతో అధికారులు వికలాంగుడికి పెన్షన్ ఆపేశారు. గత మూడు నెలల నుంచి పెన్షన్ రాకపోవడంతో బంధువుల చెంత ఉంటున్నాడు. విజయ్ ఇంట్లో నుంచి ఒక్క అడుగు వేయలేదని పరిస్థితిలో ఉన్నాడు, మీ సేవకు వెళ్లి సదరం సర్టిఫికేట్ తో ఆధార్ ఎలా లింక్ చేయించుకుంటాడని నెటిజన్లు మండిపడుతున్నారు. 90 శాతం అంగవైకల్యం ఉన్నవారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడంతో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక అనాథ అది కూడా వికలాంగుడు అయిన ఓ అబ్బాయి పట్ల ఇలా చేయడం సబబేనా? నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మానవత్వం ఉన్నవారు ఎవరైనా ఇలా గోస పెడతారా? నిజంగా అతని బాధ వర్ణనాతీతం అని నెటిజన్లు బాధను వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story