యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన ‘హనుమాన్ చాలీసా’

Hanuman Chalisa
X

సాధారణంగా యూట్యూబ్‌లో కొన్ని పాటలకు కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ, ఓ దేవుడి పాటకి కోట్లల్లో వ్యూస్ రావడం చాలా అరుదు. కానీ, ‘శ్రీ హనుమాన్ చాలీసా’కు ఏకంగా 500 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ స్థాయి వ్యూస్ అందుకున్న తొలి భారతీయ వీడియోగా రికార్డు సృష్టించింది. 2011, మే 10న ప్రముఖ మ్యూజిక్ రికార్డు లేబుల్ టి-సిరీస్ తన భక్తి ఛానెల్‌లో ‘శ్రీ హనుమాన్ చాలీసా’ గీతాన్ని అప్‌లోడ్ చేసింది. ఈ గీతాన్ని ప్రముఖ సింగర్ హరిహరన్ పాడగా.. లిలిత్‌సేన్ సంగీతం అందించారు. టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ ఇందులో నటించారు. అందరి ఇళ్లల్లో గత 14 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ చాలీసా వినిపిస్తోంది. దీంతో ఈ గీతానికి 500 కోట్ల వ్యూస్ దక్కాయి.

ఈ సందర్భంగా దీనిపై టి-సిరీస్ ఎండి భూషణ్ కుమార్ స్పందించారు. ‘‘నాతో సహా లక్షల మంది హృదయాల్లో హనుమాన్ చాలీసాకు ప్రత్యేక స్థానం ఉంది. నా తండ్రి ఆధ్యాత్మిక సంగీతంపై మక్కువ చూపేవారు. అది అందరికీ చేరవ కావాలని కోరుకునేవారు. ఆ దార్శనికతకు ఇది నిదర్శనం. 500 కోట్ల వ్యూస్ అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం. ఈ విజయం మా ప్రయాణానికి మరింత స్పూర్తినిస్తుంది’’ అని భూషణ్ అన్నారు.

Tags

Next Story