ఆసియాకప్ ఫైనల్‌కి ముందు భారత్‌కు ఊహించని షాక్

ఆసియాకప్-2025లో భారత విజయ పరంపర కొసాగుతోంది. శ్రీలంకతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఒక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమవుతోంది సూర్యకుమార్ సేన. అయితే ఈ కీలక మ్యాచ్‌కి ముందుకు భారత్‌కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాలు గాయపడినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హార్థిక్ కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఒక ఓవర్ వేసి ఏడు పరుగులు ఇచ్చి కుశాల్ మెండిస్(0)ని ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్థిక్ మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. అంతకు ముందు బ్యాటింగ్‌లోనూ 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక అభిషేక్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లోనూ అర్థశతకంతో మెరిశఆడు అతడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత శ్రీలంక బ్యాటింగ్ చేసినప్పుడు అతడు ఫీల్డింగ్ చేయలేదు. వీరిద్దరి గురించి బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ.. ‘‘హార్థిక్ కండరాలు పట్టేశాయి.. శుక్రవారం రాత్రి.. శనివారం ఉదయం పరీక్షించిన తర్వాత అతడి ఫిట్‌నెస్‌పై అంచనాకు వస్తాం. ఇక అభిషేక్‌కి కూడా కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయితే తాను బాగానే ఉన్నాడు. ఇప్పటికైతే గాయం పెద్దగా లేదు’’ అని అన్నారు. దీంతో వీరిద్దరు ఫైనల్ మ్యాచ్‌లో ఆడుతారా..? లేదా..? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.
-
Home
-
Menu