టి-20 సిరీస్‌కి ముందు భారత్‌కు భారీ షాక్?

టి-20 సిరీస్‌కి ముందు భారత్‌కు భారీ షాక్?
X

భారత పర్యటనలో సౌతాఫ్రికా జట్టు టెస్ట్ సిరీస్‌ని 2-0తో వైట్‌వాష్ చేసింది. దీనికి ప్రతీకారంగా భారత్ వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది. నేడు ఇరు జట్లు మధ్య టి-20 సిరీస్ ప్రారంభం కానుంది. మంగవారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ హార్థిడ్ పాండ్యా.. మళ్లీ ఈ మ్యాచ్‌తో రీ ఎ్రంట్రీ ఇస్త్తున్నడనే వార్తలు వచ్చాయి. అయితే హార్థిక్ టి-20 సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో హార్థిక్ పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్థిక్ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడే ముందు పాండ్యా దేశవాళీ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు బరోడా తరఫున ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాడు. హార్దిక్ షెడ్యూల్ ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం రెండు మ్యాచ్‌లు సరిపోతాయని నిర్ణయించింది. దీంతో పాండ్యా నేరుగా తొలి మ్యాచ్ జరిగే కటక్‌కు చేరుకున్నాడు.

ఈ క్రమంలో ట్రైనింగ్‌లో కూడా అతడు ఒంటిరిగా పాల్గొన్నాు. దీంతో హార్థిక్ మ్యాచ్‌లో పాల్గొనడం పక్కా అని అంతా భావించారు. కానీ, అనుకోకుండా సోమవారం అతడు ప్రాక్టీస్‌కి రాలేదు. దీంతో హార్థిక్ మళ్లీ గాయపడ్డాడా.? అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. కానీ, హార్థిక్‌కు ఎటువంటి గయాం లేదని ఓ ప్రముఖ క్రీడా పత్రక పేర్కొంది.

Tags

Next Story