రేవంత్ అధికారం శాశ్వతం కాదు.. వచ్చేది బిఆర్‌ఎస్సే: హరీశ్

రేవంత్ అధికారం శాశ్వతం కాదు.. వచ్చేది బిఆర్‌ఎస్సే: హరీశ్
X

హైదరాబాద్: పర్యాటకాభివృద్ధి పేరిట కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసిందని బిఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించి స్కామ్‌కు తెరలేపారని మండిపడ్డారు. హరీశ్ ఎక్స్ ఖాతాలో.. నిబంధనలకు విరుద్ధంగా రూ.15 వేల కో్ట్ల పనులు అప్పగించారని అన్నారు. లక్షల కోట్ల విలువైన భూములను ధారదత్తం చేసేందుకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. పనులను రహస్యంగా ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి ఆధారాలు బయటపెడతామని తెలిపారు. ‘సిఎం రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు.. వచ్చేది బిఆర్ఎస్ సర్కార్’ అని అన్నారు. ఈ దోపిడిలో భాగమైన ఏ ఒక్కరినీ వదలిపెట్టమని హెచ్చరించారు.

Tags

Next Story