సిట్.. ‘సిఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్’గా పని చేస్తోంది: హరీశ్ రావు

Harish Rao
X

హైదరాబాద్: కెసిఆర్‌ను విచారించటం.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్‌లోని కెసిఆర్ నివాసంలో ఆయన్ను సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 4 గంటలకు పైగా ఈ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. సిట్ పేరిట ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ విచారణలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలనూ ఉల్లంఘించారని పేర్కొన్నారు. కెసిఆర్‌కు నోటీసులు ఇవ్వడంలో చట్టపర విధానాలు పాటించలేదని ధ్వజమెత్తారు. ఎర్రవెల్లిలో ఇవ్వకుండా నందినగర్‌ ఇంటి గోడలకు నోటీసులు అంటించారని అన్నారు. ఇలా నోటీసులు అంటించడం ఇది చౌకబారు రాజకీయమని విమర్శించారు. కెసిఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ సిట్.. ‘సిఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్‌’గా పని చేస్తోందని ఎద్దేవా చేశారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. పోలీసులు అతి చేస్తున్నారు మండిపడ్డారు.

Tags

Next Story