రెండేళ్ల కాంగ్రెస్ పాలన నిస్సారం, నిరర్థకం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు మొండి చే యి చూపిందని, పాలన పూర్తిగా ఆగమాగంగా ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. రెండేళ్ల పాలన అనేది ప్రభు త్వ పనితీరుకు గీటురాయిలాంటిదని, కానీ కాం గ్రెస్ ప్రభుత్వ పాలన నిస్సారం, నిష్పలం, నిరర్ధకంగా మిగిలిపోయిందని దుయ్యబట్టారు. ఈ రెం డేళ్లలో ఆత్మస్తుతి, పరనింద తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీ డియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, రెండేళ్ళ కాం గ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించా రు. తమ ప్రభుత్వం రాగానే మిషన్ భగీరథ, మిష న్ కాకతీయ వంటి పథకాలు తెచ్చామని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా దర్బార్ కూడా ఇప్పుడు అమలు కావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రజా దర్బార్‌లో ప్రజల ను కలుస్తా అన్నారని.. ఆ గొప్పలు ఏమయ్యాయ ని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బిల్డప్ బాబాయ్ అం టూ ఘాటు విమర్శలు చేశారు.
జల్సాలకు, విం దులకు పెళ్లిళ్లకు, సిఎల్‌పి మీటింగ్‌లకు ప్రజా భవన్‌ను వాడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ తెచ్చిన మెట్రో రైలు, ఫార్మా సిటీ వంటి కీలక ప్రాజెక్టులను రద్దు చేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఆరోపించారు. మక్కలు కొని 50 రోజులు దాటినా రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. రైతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వం రైతు సంక్షోభ ప్రభుత్వం అని మండిపడ్డారు.పూర్తిస్థాయి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని... నిరూపించలేకపోతే రాజీనామాకు సిఎం రేవంత్ రెడ్డి సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లు బిల్లులు అడిగితే ప్రభుత్వం విజిలెన్స్, ఎసిబి దాడులు చేయిస్తోందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు
గ్లోబల్ సమ్మిట్‌ను ‘గోబెల్స్ సమ్మిట్‘ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు. గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బిఆర్‌ఎస్ హయాంలో సమీకరించినదే గుర్తు చేశారు. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని అన్నారు. కెసిఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉందని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు.
రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అని ఆరోపించారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్‌రావు అన్నారు.
Tags
-
Home
-
Menu
