కారులో భారీగా హవాలా డబ్బు లభ్యం

Money
X

హైదరాబాద్: హవాలా మార్గంలో కారులో తరలిస్తున్న భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. శామీర్‌పేటలో పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఓ కారులో టైర్లు, సీట్ల కింద దాచిన రూ.4 కోట్ల నగదును బోయిన్‌పల్లి క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా కేసులో 2024లో ఓ వ్యక్తి పరారయ్యాడు. శుక్రవారం ఆ వ్యక్తి భారీ మొత్తంలో నగదుతో నిజామాబాద్ నుంచి వస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శామీర్‌పేట ఔటర్ రింగ్‌ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని, హవాలాలో తరలిస్తున్న నగదును సీజ్ చేశారు.

Tags

Next Story