రూ.22 కోసం ప్రాణం తీశాడు

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలంలో 22 రూపాయల కోసం తోటి కార్మికుడిని హత్య చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ సిరాజ్(30), మహేష్ కుమార్ వర్మ(33) అనే యువకులు చేగుంట మండలంలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఇద్దరు ఒకే రూమ్‌లో ఉండేవారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం సేవించారు. మహేష్‌కు సిరాజ్ రూ. 22 ఇవ్వాల్సి ఉంది. డబ్బులు ఇవ్వాలని పలుమార్లు అడిగాడు. మద్యం తాగుతున్నప్పుడు డబ్బులు ఇవ్వాలని మహేష్ డిమాండ్ చేయడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో సిరాజ్ తలను చెట్టుకు గట్టిగా కొట్టడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో మహేష్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండో రోజుల్లోనే నిందితుడు మహేష్ పట్టుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Tags
-
Home
-
Menu
